విడిచిపెట్టకుడి


"కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును."

( హెబ్రీయులకు 10:35 )


నీవు ప్రార్ధిస్థూ, నేరవేరుతుందని నమ్ముతూ వున్న కొన్ని అంశాలు జవాబురావటానికి నీవు అనుకున్న దానికన్న ఎక్కువ సమయమును తీసికొంటున్నాయా ? చాలా సార్లు, ప్రజలు దేవుని మంచి ఈవులను పొందలేక పొవటానికి కారణము జవాబు వచ్చే సమయానికి వారు విరమించుకుంటారు. నీవు ఆవిధముగా ఉండకూడదు, ప్రొత్సాహము తెచ్చుకొని బలపడు, నీవు అనుకున్న దానికన్న సరైన సమయానికే నీ ప్రార్ధనకు జవాబు రాబోతూంది. ఒకవేళ్ళ కార్యాలు కఠినముగా మారిపోతుంటే, మరిచిపోవద్దు , వేడి పెరిగి పొతుంటే నీవిజయము దగ్గరకు వచ్చేసినట్లే. చీకటి పొరలలోనుంచె ప్రకాశవంతమైన వుదయము మనము చూడగలము. 


నీ వెనుక నీ జయము కొరకు "కునుకక నిదురపోక" పనిచేస్తున్న దేవుడు "నమ్మదగిన దేవుడు". నీ నమ్మకాన్ని చేజార్చు కోకు అతిత్వరలో నీవు విజయము చూడబోతున్నావు. ప్రసవవేధనతో వున్న స్త్రీ , తనకు పుట్టిన శిశువును చూసుకుంటూ తన బాధ అంతా మరచినట్లు, నీ వాగ్ధానాన్ని నీవు గట్టిగా పట్టుకుంటె నీ శ్రమనంతా నీవు మరచిపోతావు. నీవు ఇంకా నిరీక్షిస్తూండగానే విశ్వాసాన్ని ఎదురుచూపును నీ వైఖిరిగా మార్చుకో. వుదయాన్నే లేచినప్పుడు బిగ్గరగా చెప్పు ఇక నేను వదిలేదిలేదు, నా సమయము వచ్చేసిందని, నా పంటను నేను కొయ్యబోతున్నాను అని ప్రకటించు. విశ్వాసముతో ఆయన ఇచ్చే దీవెనకొరకు ఎదురుచూస్తూ వుండగా వాగ్ధానము చేయబడిన విజయము తప్పకా లభిస్తుంది.


ప్రార్ధన : పరలోకమందున్న తండ్రీ మీరు నా కొరకు నా వేనుక పనిజరిగిస్తున్నారని నమ్ముతూ మిమ్మును స్తుతించుచున్నాను. ఆ వాగ్ధాన ఫలములు పొందేవరకూ బలమును, విశ్వాసమును నాకు దయచేయుము. ఏసునామములో వేడుకొనుచున్నాను తండ్రీ! ఆమెన్.

Comments

Popular posts from this blog